వ‌ర్మ‌కు స్ట్రోంగ్ కౌంట‌ర్ ఇచ్చిన మంచు మ‌నోజ్‌..అస‌లేమైందంటే?

టాలీవుడ్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఎప్పుడూ ఏదో ఒక విష‌యంపై వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారుతూనే ఉంటారు. అయితే తాజాగా వ‌ర్మకు మంచు వారి అబ్బాయి మంచు మ‌నోజ్ స్ట్రోంగ్ కౌంట‌ర్ ఇచ్చాడు. అస‌లేం జ‌రిగిందంటే..

- Advertisement -

FWICE bans Ram Gopal Varma for failing to pay Rs 1.25 crore in salaries to workers : Bollywood News - Bollywood Hungama

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు పూర్తై దాదాపు ప‌ది రోజులు కావొస్తున్నా.. ఇంకా ర‌చ్చ మాత్రం కొన‌సాగుతూనే ఉంది. మంచు విష్ణు గెలిచి `మా` నూత‌న అధ్య‌క్షుడిగా ప్ర‌మాణ‌స్వీకారం కూడా చేశారు. అయినా మాకు అన్యాయం జరిగింది, ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ప్ర‌కాశ్ రాజ్ వాధిస్తున్నాడు.

Manchu Manoj Contact Address, Phone Number, House Address

ఈ నేప‌థ్యంలోనే వ‌ర్మ `మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఓ సర్కస్ అని, అందులో ఉండే సభ్యులంతా జోకర్లు` అంటూ షాకింగ్ ట్వీట్ చేయ‌గా.. అది కాస్త తెగ వైర‌ల్ అయింది. ఇక ఈ ట్వీట్‌పై తాజాగా స్పందించిన మంచు మ‌నోజ్‌.. `మా ఒక సర్కస్ అయితే… మీరు రింగ్ మాస్టర్ సర్` అంటూ త‌నదైన శైలిలో కౌంట‌ర్ ఇచ్చారు. దాంతో ఇప్పుడు మ‌నోజ్ ట్వీట్ వైర‌ల్‌గా మారింది. మ‌రి దీనిపై వ‌ర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Share post:

Popular