`మ‌హాస‌ముద్రం` హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు రాబ‌ట్టాలో తెలుసా?

శ‌ర్వానంద్‌, సిద్ధార్ధ్ హీరోలుగా అజ‌య్ భూప‌తి దర్శకత్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `మ‌హాస‌ముద్రం`. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మించారు.

Mahasamudram trailer: Sharwanand-Siddharth starrer promises an intense action drama | Entertainment News,The Indian Express

సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుమ‌ నేడు గ్రాండ్‌గా విడుద‌లైంది. ట్విట్ట‌ర్ టాక్ చూస్తుంటే.. ఈ సినిమా ఫస్టాఫ్ బాగానే ఉంద‌ని, బ్యాక్ గ్రౌండ్ అదిరిపోయింద‌ని, ఇంటర్వెల్ ఫైట్ ఎపిసోడ్ హైలెట్ అని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం భారీ ట‌ర్గెట్‌తోనే బ‌రిలోకి దిగింద‌ని చెప్పాలి.

Maha Samudram”: All details about the Telugu love drama film - TechnoSports

ఈ చిత్రానికి రూ.16.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దాంతో ఇప్పుడు ఈ సినిమా హిట్‌ అవ్వాలంటే రూ.17 కోట్ల వరకు షేర్ ను రాబ‌ట్టాల్సి ఉంది. అయితే ఎలాగో ఏపీలో 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ చేసుకోవచ్చు అని ప్రభుత్వం తాజాగా పర్మిషన్ ఇచ్చింది. కాబ‌ట్టి, హిట్ టాక్ వ‌స్తే మ‌హాస‌ముద్రం సుల‌భంగా టార్గెట్ ను రీచ్ అవ్వ‌గ‌ల‌ద‌ని సినీ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

Share post:

Latest