అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ స‌ర్కార్‌..ఫుల్ ఖుషీలో టాలీవుడ్‌!

October 14, 2021 at 8:06 am

క‌రోనా వైర‌స్ మహ‌మ్మారి కార‌ణంగా మూత‌ప‌డిన థియేట‌ర్లు ఈ మ‌ధ్యే తెరుచుకుని వంద శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నా, ఏపీలో మాత్రం యాభై శాతం ఆక్యుపెన్సీకే జ‌గన్ ప్ర‌భుత్వం అనుమ‌తిని ఇచ్చింది. ఈ విష‌యంపై ఏపీ ప్రభుత్వంతో తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్ద‌లు చర్చలు జ‌రుపుతూనే ఉన్నాయి.

Brand TOLLYWOOD Introduction

అయితే ఎట్ట‌కేల‌కు ఏపీ స‌ర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్ తెలిపింది. నేటి నుంచి వంద శాతం ఆక్యుపెన్సీతో, రోజుకు నాలుగు ఆటలు వేసుకోవచ్చ‌ని తాజాగా ప్రకటించింది. ఈ మేర‌కు జీవో కూడా జారీ చేసింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Govt allows 100% occupancy in cinema halls, theatres from February 1 - India News

దాంతో టాలీవుడ్ ఫుల్ ఖుషీ అయిపోయింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు సీఎం జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అలాగే నిర్మాణ సంస్థలైన డీవీవీ, మైత్రి వారు కూడా వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ప్రారంభించుకోవడానికి పర్మిషన్ ఇచ్చినందుకు ఏపీ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పారు. మ‌రోవైపు ఏపీ స‌ర్కార్ నిర్ణ‌యంపై థియేటర్‌ యజమానులు, సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ స‌ర్కార్‌..ఫుల్ ఖుషీలో టాలీవుడ్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts