ప్రకాష్ రాజ్ పై తీవ్ర విమర్శలు చేసిన కోట శ్రీనివాసరావు.. ఎందుకో తెలుసా?

అక్టోబర్ 10 న మా ఎన్నికలు జరగనున్న విషయం అందరికి తెలిసిందే. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ మా కుటుంబ సభ్యుల మధ్య మాటలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒకరి ప్యానల్ సభ్యుల పై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు స్పందిస్తున్నారు. ఏ ఒక్కరూ తగ్గట్టు గా కనిపించడం లేదు. మా ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి.

అంతేకాకుండా ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ పై కోట శ్రీనివాస్ రావు తీవ్ర విమర్శలు చేశారు.ప్రకాష్ రాజ్ అనేటటువంటి వ్యక్తి నటుడిగా అతని గురించి నేను ఏమీ మాట్లాడను. అలాగే నేను చెప్పుకోను. నేను నేషనల్ లెవెల్ ఆర్టిస్ట్ ని నాకు ఎన్ని అవార్డులు వచ్చాయి అని అవార్డ్స్ వచ్చాయి చెప్పుకోను.

ఈ సందర్భంగా నేను చెప్పదలచుకున్నది మూడే మూడు విషయాలు.. ప్రకాష్ రాజ్ తో కలసి నేను దాదాపుగా 15 సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ లో నటించాను. ఏ సినిమాకు కూడా ఒక్క రోజు కూడా అతను టైం కి రాలేదు. ఇక ఇందులో నటుడు కోట శ్రీనివాసరావు మంచు విష్ణు కి మద్దతుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ప్రకాష్రాజు క్రమశిక్షణ లేదంటూ ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

Share post:

Latest