మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా మంచు మనోజ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మంచు విష్ణు ఈరోజు అంటే శనివారం ఉదయం ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్లో 11 గంటలకు మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ సమక్షంలో మా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.మంచు విష్ణుతో పాటు ఆయన ప్యానెల్ నుంచి గెలుపొందిన మరో 15 మంది సభ్యులూ కూడా ఒకరి తరువాత ఒకరు ప్రమాణస్వీకారం చేసారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే నటుడు మోహన్ బాబు, నరేష్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు, విష్ణు సతిమణి విరానిక వారి పిల్లలు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసారు. అయితే ‘మా’ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ప్రకాశ్‌రాజ్, అతని ప్యానెల్ సభ్యులెవరూ రాకపోవడం గమించాలిసిన విషయం అనే చెప్పాలి.