ఆదిపురుష్‌: సీత ప‌నైంది.. ఇక మిగిలింది రాముడే..?!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `ఆదిపురుష్‌`. రామాయణం ఆధారంగా భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీత‌గా నటిస్తోంది.

Image

అలాగే లక్ష్మణుడిగా సన్నీ సింగ్, ప్రభాస్‌తో తలపడబోయే రావణుడి పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నారు. అయితే ఇటీవ‌లె సైఫ్ అలీ ఖాన్ త‌న షూటింగ్ పార్ట్‌ను ఫినిష్ చేసుకుని ఆదిపురుష్ టీమ్‌కు బై బై చెప్పేశారు. ఇక తాజాగా కృతి సనన్ ప‌ని కూడా అయిపోయింది.

Image

అవును, సీతకు సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తాన్ని కృతి స‌న‌న్ పూర్తి చేసిన‌ట్లు డైరెక్ట‌ర్ ఓం రౌత్ స్వ‌యంగా తెలిపారు. ఇక మిగిలింది రాముడి వంతు మాత్రమే. మ‌రి ప్ర‌భాస్ త‌న పార్ట్ షూట్‌ను ఎప్పుడు ఫినిష్ చేస్తాడో చూడాలి. కాగా, టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2022 ఆగష్టు 8న గ్రాండ్ రిలీజ్ కానుంది.