ప్ర‌ముఖ ఓటీటీలో `ల‌వ్ స్టోరి`.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

అక్కినేని నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ల‌వ్ స్టోరి`. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. భారీ అంచ‌నాల న‌డుమ‌ సెప్టెంబ‌ర్ 24న విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

Repairs for Love Story?

క‌లెక్ష‌న్ల ప‌రంగా కూడా ఈ చిత్రం దుమ్ముదులిపేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వ‌స్తుందా అని అటు నాగ‌చైత‌న్య ఫ్యాన్స్‌, ఇటు సాయి ప‌ల్ల‌వి ఫ్యాన్స్ ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంద‌ట‌.

Love Story OTT Release Date, Digital & Satellite rights - Telugu Movies Adda

సినిమా విడుదలైన యాబై రోజులకు అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. దాంతో లవ్ స్టోరి దీపావళీ కానుకగా స్ట్రీమింగ్ కావోచ్చని చర్చించుకుంటున్నారు. మ‌రి ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Share post:

Popular