రిస్క్ చేస్తున్న రాజ‌మౌళి..`ఆర్ఆర్ఆర్‌` రన్ టైమ్ ఎంతో తెలిస్తే షాకే?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిన చిత్రం `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టించ‌గా..అజయ్ దేవగన్, శ్రియ త‌దిత‌రులు ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లు పోషించారు. స్వాతంత్ర్య సమరయోధులు, అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా క‌ల్పిత క‌థ రూపుదిద్దుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న విడుద‌ల చేయ‌బోతున్నారు.

Vijayendra Prasad addresses RRR controversies, says SS Rajamouli film 'cannot be compared to Baahubali' | Entertainment News,The Indian Express
ప్ర‌స్తుతం సినిమాపై మ‌రింత హైప్ క్రియేట్ చేసేందుకు మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్‌కు సిద్ధం అవుతున్నారు. అయితే ఇలాంటి త‌రుణంలో ఆర్ఆర్ఆర్ రన్ టైమ్పై ఓ షాకింగ్ వార్త బ‌య‌టకు వ‌చ్చింది. ఆర్‌ఆర్‌ఆర్ ఏకంగా మూడు గంటలకు పైగా న‌డివి కలిగి ఉంటుందట. కథ, కథనాల రీత్యా మూవీ రికార్డు రన్ టైం సాగుతుందని అంటున్నారు.

Roar of RRR: SS Rajamouli promises to outdo Baahubali success, confirms October release for Ram Charan-Jr NTR movie | Entertainment News,The Indian Expressసినిమాలో పాటలు పది వరకు ఉంటాయట. అలాగే భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తోపాటు మంచి ఎమోషన‌ల్ సీన్స్‌ కూడా ఎక్కువగా ఉంటాయ‌ట‌. అయితే ఎంత కంటెంట్ ఉన్నా.. ఎన్ని హంగులు, ఆర్భాటాలు చేసినా.. మూడు గంట‌ల‌కు పైగా ర‌న్ టైమ్‌ అంటే రాజ‌మౌళి రిస్క్ చేస్తున్న‌ట్టే లేక్క‌.