క్రమశిక్షణ లేని వ్యక్తులతో మాట్లాడడం వ్యర్ధం అంటున్న మంచు విష్ణు..!

గత నెలరోజుల నుంచి సినీ ఇండస్ట్రీలో మా ఎన్నికల పోరు రాజకీయాల కంటే హీటెక్కిస్తోంది.. ముఖ్యంగా మరో నాలుగు రోజుల్లో ఎవరి భవిష్యత్తు ఎలానో తేలబోతున్న విషయం తెలిసిందే.. కానీ రాజకీయాల కంటే దారుణంగా సినీ ఇండస్ట్రీలో పెద్దలు ఒకరికొకరు మాటల తూటాలు విసురుకుంటున్నారు.. ఒక వైపు చూస్తే మొదట ప్రకాష్ రాజ్ పానెల్ కోసం జీవిత రాజశేఖర్ , నటి హేమ లతో మాట్లాడిన మెగా ఫ్యామిలీ.. ఇప్పుడు మాత్రం ప్రకాష్ రాజ్ ప్యానల్ కు మద్దతు ఇవ్వడం లేదు.

పైగా మంచు విష్ణు కూడా ఆయన సపోర్ట్ ఇవ్వలేదనే చెప్పాలి. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ఒక పెద్ద గా తన స్థానాన్ని నిలుపుకోవాలంటే ఇద్దరికీ సమాన న్యాయం చేయాలన్న విషయాన్ని ఆయన మరొకసారి గుర్తు చేశారు. ఇకపోతే ప్రకాష్ రాజ్ ,మంచు విష్ణు ల మధ్య భీకరమైన మాటల యుద్ధం జరుగుతోంది.. మంచు విష్ణు క్రమశిక్షణ కలిగిన ఫ్యామిలీ నుంచి వచ్చాము..పద్ధతులు మాకు తెలుసు అని చెప్పడంతో.. ప్రకాష్ రాజ్ అందుకు మేము క్రమశిక్షణ లేని బజార్ ఫ్యామిలీల నుంచి వచ్చామా..? మా కుటుంబాలకు క్రమశిక్షణ లేవా.. మాకు క్రమశిక్షణ తెలియదా.. అంటూ విచక్షణారహితంగా మాట్లాడడంతో అందుకు మంచు విష్ణు క్రమశిక్షణ అర్థమే తెలియని వ్యక్తి తో మాట్లాడటం వ్యర్థం అంటూ కౌంటర్ ఇచ్చాడు..

ఇక వీరిద్దరి మధ్య మాటల పోరు ఎప్పటికి ఆగుతుందో మనం వేచి చూడక తప్పదు.