సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు బిగ్ షాక్‌..అర‌రే ఇలా జ‌రిగిందేంటి..?

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు బిగ్ షాక్ త‌గిలింది. ఈయ‌న న‌టించిన తాజా చిత్రం `రిప‌బ్లిక్‌` వివాదంలో చిక్కుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. దర్శకుడు దేవా కట్టా, సాయి తేజ్ కాంబోలో తెర‌కెక్కిన చిత్రం `రిప‌బ్లిక్‌`. ఐశ్వ‌ర్యా రాజేశ్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌లు పోషిచారు.

Republic | Trailer | Sai Tej | Aishwarya Rajesh | Jagapathibabu | Ramya | Deva Katta | Oct 1st - YouTube

భారీ అంచ‌నాల న‌డుమ‌ అక్టోబ‌ర్ 1న విడుద‌లైన ఈ చిత్రం మంచి టాక్‌ని సొంతం చేసుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. ఇలాంటి త‌రుణంలో ఈ చిత్రం చిక్కుల్లో ప‌డింది. ఈ సినిమాపై ఆంధ్రప్రదేశ్ లోని కొల్లేరు ప్రాంత వాసుల నుంచి ఆగ్ర‌హ జ్వాల‌లు వెల్లువెత్తుతున్నాయి. కొల్లేరు ప్రజల జీవనస్థితిగతులకు వ్యతిరేకంగా సినిమా తీశారని.. తామంతా కొల్లేరుపై ఆధారపడి జీవిస్తుంటే.. అక్కడి వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా సన్నివేశాలున్నాయని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు.

Republic review: Sai Dharam Tej delivers hard-hitting drama about corruption - Hindustan Times

రిపబ్లిక్ సినిమాలోని సన్నివేశాలు తమ జీవనోపాధిని దెబ్బతీసే విధంగా ఉన్నాయని.. వెంటనే సదరు సన్నివేశాలను తొలగించాలంటూ సినిమా యూనిట్ పై జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. లేదంటే కోర్టుకు వెళ్తామ‌ని హెచ్చ‌రిస్తున్నారు. మ‌రి ఈ వివాదంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.