`జై భీమ్‌` ట్రైలర్‌.. సూర్య పోరాటం ఫ‌లిస్తుందా..?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజా చిత్రం `జై భీమ్‌`. టీ జే జ్ఞాన్వెల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సూర్య, ఆయన సతీమణి జ్యోతిక సంయుక్తంగా నిర్మించారు. నవంబర్ 2న ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, త‌మిళ మ‌రియు హిందీ భాష‌ల్లోనే ఒకేసారి విడుద‌ల కానుంది.

Jai Bhim trailer: Suriya plays a firebrand lawyer who rattles the cage of the powerful | Entertainment News,The Indian Express

ఈ నేప‌థ్యంలోనే తాజాగా మేక‌ర్స్ జై భీమ్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. `పోరాడుదాం పోరాడుదాం.. న్యాయం జరిగేవరకు పోరాడుదాం` అంటూ సూర్య చెప్పే నినాదంతో ప్రారంభ‌మైన ట్రైల‌ర్‌.. ఆధ్యంతం ఆక‌ట్టుకుంది. అన్యాయానికి గురైన ఓ గిరిజన కుటుంబం కోసం పోరాటం చేసే న్యాయవాదిగా సూర్య క‌నిపించ‌నున్నాడు.

Jai Bhim trailer out. Suriya asks tough questions as he fights for tribals - Movies News

`బాధింపబడ్డ వారికి లభించని న్యాయం… వాళ్లకి జరిగిన అన్యాయం కంటే దారుణంగా ఉంటుంది`, `లా.. శక్తిమంతమైన ఆయుధం. ఎవరిని కాపాడేందుకు దాన్ని ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యం’ అంటూ ట్రైల‌ర్‌లో సూర్య చెప్పే చెప్పే డైలాగ్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. అలాగే లాయ‌ర్‌గా సూర్య న‌ట‌న అద్భుత‌మ‌ని చెప్పాలి. మొత్తానికి అదిరిపోయిన ఈ ట్రైల‌ర్ సినిమాపై మ‌రిన్ని అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. మ‌రి పేద గిరిజ‌న‌ల కోసం సూర్య చేసే పోరాటం ఫ‌లిస్తుందా..? లేదా..? అన్న‌ది తెలియాలంటే న‌వంబ‌ర్ 2 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

Share post:

Latest