మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన తాజా చిత్రం `కొండ పొలం`. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన నవల ఆధారంగా రూపొందిన సినిమా ఇది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 8న విడుదలైన మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.
ఈ చిత్రంలో గొర్రెల కాపరుల కుటుంబానికి చెందిన యువకుడిగా వైష్ణవ్ అద్భుతంగా ఒదిగిపోయాడు. మరోవైపు ఓబులమ్మగా రకుల్ అదరగొట్టేసింది. ఈ విషయాలు పక్కన పెడితే.. అసలు `కొండ పొలం` చిత్రాన్ని క్రిష్ చేయకుంటే ఏ డైరెక్టర్ చేసేవాడో తెలుసా..? మన స్టార్ డైరెక్టర్ సుకుమార్.
అవును,`కొండ పొలం` అనే నవల ఆధారంగా సినిమా తీయాలనే ఆలోచన ముందుగా చేసింది సుకుమారేనట. కానీ, క్రిష్ అప్పటికే ఆ నవల రైట్స్‌ను కొనుగోలు చేసేశారట. ఈ విషయం తెలుసుకున్న సుకుమార్.. తన ఆలోచనను విరమించుకున్నాడట. మరి కొండ పొలంను క్రిష్ కాకుండా సుకుమార్ తీసుంటే ఎలా ఉండేదో….!