నందమూరి బాలకృష్ణ తొలిసారి ఒక ఓటీటీలో హోస్టుగా అవతారం ఎత్తనున్న సంగతి తెలిసిందే. టాక్ షో లో హోస్ట్ గా చేయాలని ప్రముఖ ఓటీటీ యాప్ ఆహా బాలయ్య ను సంప్రదించగా అందుకే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ టాక్ షో ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో సాగుతుందని సమాచారం. ఆహాలో అతి త్వరలోనే ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.
ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో అతి త్వరలోనే ఈ కార్యక్రమం ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తోంది. బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించే ఈ కార్యక్రమానికి మొట్టమొదటి అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్నట్లు సమాచారం. చిరంజీవికి బాలకృష్ణ కు మధ్య ఉన్న వార్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.
80స్ నుంచి చిరు, బాలయ్య మధ్య పోటీ నడుస్తోంది. ఇండస్ట్రీలో చిరంజీవి నెంబర్ వన్ గా, బాలకృష్ణ నెంబర్ 2గా ఏళ్లతరబడి కొనసాగారు. ఇక వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు ఒకే రోజు వీలయితే థియేటర్ల వద్ద పోటాపోటీ వాతావరణం నెలకొని ఉండేది. అలాంటిది తొలిసారిగా వీరిద్దరూ ఒక టాక్ షో కోసం ఒకే ఫ్రేమ్ లో కనిపించనున్నారు. దీంతో ఈ కార్యక్రమం కోసం అటు నందమూరి అభిమానులు ఇటు చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.