`స్పిరిట్‌`లో హీరోయిన్ ఫిక్స్‌..ప్ర‌భాస్ జోడీ ఎవ‌రంటే?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ త‌న 25వ చిత్రాన్ని ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగాతో చేయ‌బోతున్న‌ట్టు నిన్న అధికారికంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కు `స్పిరిట్‌` అనే టైటిల్‌ను క‌న్ఫార్మ్ చేసేశారు. టీ సిరీస్, భద్రకాళి ఫిలిమ్స్, యువి క్రియేషన్స్ బ్యాన‌ర్ల‌పై భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నిర్మించ‌బోతున్నారు.Prabhas and Sandeep Reddy Vanga's next titled Spirit | The News Minute

భూషణ్‌ కుమార్‌, వంశీ, ప్రమోద్‌, కృష్ణ కుమార్ లు ఈ చిత్రానికి నిర్మాత‌లు. తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మల‌యాళ భాష‌ల్లోనే కాకుండా విదేశీ భాష‌ల్లోనూ ఈ చిత్రం విడుద‌ల కానుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్లు ఉండ‌నున్నార‌ట‌.Spirit Movie (Prabhas 25) Full Details: Cast | Trailer | Songs | Release Date - News Bugzఅందులో ఒక హీరోయిన్‌ను ఇప్ప‌టికే మేక‌ర్స్ ఫిక్స్ చేశారట‌. ఇంత‌కీ ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు.. టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌. ఈ మ‌ధ్యే కాజ‌ల్‌ను సంప్ర‌దించి క‌థ చెప్ప‌గా.. వెంట‌నే ఆమె ప్ర‌భాస్‌కు జోడీగా న‌టించేందుకు ఒకే చెప్పింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే. కాగా, గ‌తంలో ప్ర‌భాస్‌-కాజ‌ల్ జంట‌గా డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్ చిత్రాల్లో న‌టించిన‌ విష‌యం తెలిసిందే.

Share post:

Latest