అమ్మాయి వయసు 35.. ఆస్తి మూడు లక్షల కోట్లు..!

దేశంలోని అత్యంత సంపన్నుల లో స్థానం సంపాదించుకోవాలి అంటే అంత ఆషామాషీ కాదు. ముఖ్యంగా తరతరాల నుంచి వస్తున్న ఆస్తులతో పాటు తల్లిదండ్రులు ఆస్తులు కూడా తోడైతే భారతదేశంలో ఉన్న 100 మంది ధనికులు లలో ఒకరిగా చోటు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కానీ ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఫోర్త్ 100 మంది జాబితాలో తన పేరును నమోదు చేసుకోవడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆ అమ్మాయి గురించి ఇప్పుడు మనం పూర్తి విషయాలను తెలుసుకుందాం..

అమ్మాయి పేరు దివ్యా గోకుల్‌నాథ్‌.. వయసు 35 సంవత్సరాలు. ఇప్పుడు కూడా పెద్ద పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోవాలి అనే తత్వం అమ్మానాన్నల నుంచి నేర్చుకుంది. ఇక ఈమె కూడా నమ్మకానికి పట్టుదల ను జోడించి చివరికి బైజూస్ అనే అభివృద్ధి పథంలో తన జీవితాన్ని సాధించాలని నిర్ణయం తీసుకుంది. దివ్య నాన్న ఏర్‌ఫోర్స్‌లో డాక్టర్‌, అమ్మ దూరదర్శన్‌ ఉద్యోగి. నాన్న స్ఫూర్తితో సైన్స్‌, మేథ్స్‌లపై ఇష్టాన్ని పెంచుకుంది. బయోటెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేసింది. పై చదువులకు విదేశాలకు వెళ్లేందుకు జీఆర్‌ఈ కోచింగ్‌ తీసుకోవాలనుకుంది. అప్పుడే ఆమెకు బైజూ రవీంద్రన్‌ గురించి తెలిసింది. ఆయన శిక్షణతో పరీక్ష రాసింది. ఫలితాలొచ్చేలోగా బైజూ ఇన్‌స్టిట్యూట్‌లో తాత్కాలికంగా బోధించడం మొదలుపెట్టింది.

అప్పటికి ఆమె వయసు 21. తర్వాత యూఎస్‌లో మంచి విద్యాసంస్థలో సీటు వచ్చినా కూడా టీచింగ్‌పై మమకారంతో దాన్ని వదులుకుంది. ఈ క్రమంలోనే బైజూ రవీంద్రన్‌తో ప్రేమలోపడి పెళ్ళి కూడా చేసుకుంది. ఇక దివ్య ఎప్పుడు కూడా నేర్చుకోవడం అనేది కేవలం పరీక్షల కోసం మాత్రమే కాకుండా ఇష్టంగా సాగాలని భావించేది. అందుకే బోధనలో కొత్త పద్ధతులను అనుసరించేది. బోధనలో కొనసాగే కొద్దీ ఒక్కొక్కరికీ ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తే బాగుంటుందనుకుంది.

ఆ ఆలోచనా ఫలితమే 2015లో బైజూస్‌ లెర్నింగ్‌ యాప్‌కు కారణమైంది. దీనికి దివ్య కోఫౌండర్‌. సంస్థ పనులు చూసుకుంటూనే బోధననూ కొనసాగించింది. సబ్జెక్టులను విడమరిచి, సులువుగా అర్థమయ్యేలా చెప్పడం ఆమె ప్రత్యేకత. అందుకే విద్యార్థులూ ఆకర్షితులయ్యారు. సంఖ్య పెరిగే కొద్దీ టీచర్లనూ పెంచుకుంటూ వెళ్లారు. మొదట 4-12 తరగతుల వారికోసం ప్రారంభమైన ఈ యాప్‌..ఇప్పుడు పోటీపరీక్షల వారికి కూడా శిక్షణనిస్తోంది. ప్రస్తుతం దీనికి ఏడున్నర కోట్లకుపైగా సబ్‌స్క్రైబర్లున్నారు. ఫేస్‌బుక్‌ అధినేత జుకర్‌బర్గ్‌ సహా ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ప్రముఖులు బైజూస్‌లో పెట్టుబడులు పెట్టారు.

కరోనా కారణంగా ఆన్‌లైన్‌ తరగతులతో దీనికి మరింత ఆదరణ పెరిగింది. దీంతో ఈమె సంపద ఒక బిలియన్‌ డాలర్లు పెరిగి రూ.3.02 లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాదికి గానూ ఫోర్బ్స్‌ విడుదల చేసిన ‘దేశంలో 100 మంది సంపన్ను’ల జాబితాలో 47 వ స్థానం.. మహిళల్లో 4వ స్థానాల్లో నిలిచింది. అంతేకాదు 100 మంది ధనవంతుల జాబితాలో అతి చిన్న వయస్కురాలిగా ఈమె గుర్తింపు పొందింది.