అఖిల్‌కి హిట్ ఇచ్చి బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన `బొమ్మరిల్లు` భాస్కర్‌..?

October 23, 2021 at 12:19 pm

`బొమ్మరిల్లు` భాస్కర్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత చేసిన చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్`. అఖిల్ అక్కినేని హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 15న విడుద‌లై మంచి విజ‌యం అందుకుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచీ వ‌రుస ఫ్లాపుల‌తోనే స‌త‌మ‌త‌మ‌వుతున్న అఖిల్ ఎట్ట‌కేల‌కు హిట్ ట్రాక్ ఎక్కాడు.

Pooja Hegde, Akhil Akkineni's Most Eligible Bachelor to release on Pongal 2021; first poster unveiled-Entertainment News , Firstpost

గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్‌పై నిర్మిత‌మైన ఈ చిత్రం భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతోంది. ఇదిలా ఉంటే.. అఖిల్‌కి హిట్ ఇచ్చిన `బొమ్మరిల్లు` భాస్కర్‌ను తాజాగా ఓ బంప‌ర్ ఆఫ‌ర్ వ‌రించింది. గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్ వారు భాస్క‌ర్‌తో మ‌రో సినిమా చేసేందుకు ఇంట్ర‌స్ట్ చూపుతున్నార‌ట‌.

Director 'Bommarillu' Bhaskar to return to Tollywood under Geetha Arts' banner | The News Minute

అంతేకాదు ఒక యువ హీరో కోసం మంచి ఫ్యామిలీ డ్రామా బ్యాక్ డ్రాప్ లో కథను రాయమని చెప్పారట. అందుకు భారీ రెమ్యూన‌రేష‌న్ కూడా ఆఫ‌ర్ చేశార‌ట‌. ఆఫ‌ర్ న‌చ్చ‌డంతో భాస్క‌ర్ ప్ర‌స్తుతం మంచి క‌థ‌ను రాసే ప‌నిలో ప‌డ్డార‌ని అంటున్నారు.

అఖిల్‌కి హిట్ ఇచ్చి బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన `బొమ్మరిల్లు` భాస్కర్‌..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts