స్టార్ హీరో కోసం మ‌ళ్లీ అలా మారుతున్న‌ అన‌సూయ‌..?!

అనసూయ భరధ్వాజ్.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. పెళ్లై ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నా బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గా దూసుకుపోతున్న అస‌సూయ‌.. మ‌రోవైపు వెండితెర‌పై సైతం మంచి మంచి పాత్ర‌ల‌ను పోషిస్తూ స‌త్తా చాటుతోంది.

Anasuya Bharadwaj HD Wallpapers | Latest Anasuya Bharadwaj Wallpapers HD Free Download (1080p to 2K) - FilmiBeat

ప్ర‌స్తుతం పుష్ప‌, ఖిలాడి, రంగమార్తాండ చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న అన‌సూయ‌.. ఇత‌ర భాష‌ల్లోనూ న‌టిస్తోంది. ఇక అప్పుడ‌ప్పుడూ ఐటం సాంగ్స్‌లోనూ మెరుస్తోంది. అయితే స్టార్ హీరో ర‌వితేజ కోసం అన‌సూయ మ‌ళ్లీ ఐటెం భామ‌గా మార‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.

Anasuya Bharadwaj to star in Ravi Teja's Khiladi - Movies News

ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాల‌తో బిజీగా ఉన్న ర‌వితేజ‌.. త్రినాథరావు నక్కిన ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రంలో ఓ అదిరిపోయే ఐటెం సాంగ్ ఉందని.. ఈ సాంగ్ లో అనసూయ నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు కూడా పూర్తి అయిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే.

 

Share post:

Latest