బిగ్‌బాస్ 5: హమీదా రెమ్యూన‌రేష‌న్..ఐదు వారాల‌కే అంత పుచ్చుకుందా?

October 12, 2021 at 8:07 am

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఆరోవారం ప్రారంభ‌మైంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభ‌మైన ఈ షో.. బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు కావాల్సినంత వినోదాన్ని పంచుతూ దూసుకుపోతోంది. ఇక మొదటి వారంలో సరయు, ఆ తర్వాత ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ కాగా..ఐదో వారం అనూహ్యంగా హమీదా ఎలిమినేట్ అయిన సంగ‌తి తెలిసిందే.

Hamida Bigg Boss Telugu Season 5 Wiki, Age, Boyfriend, Husband, Relationship, Family, Biography & More

ఇంటి స‌భ్యుల‌ను ప‌ట్టించుకోకుండా ఎప్పుడూ శ్రీ‌రామ్‌తోనే ఉండ‌టం, స‌రైన ఫ్యాన్ బేస్ లేక‌పోవ‌డం వ‌ల్ల ఆమె ఎలిమినేట్ అయింద‌ని భావిస్తున్నారు. అయితే హ‌మీదా బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న‌ది ఐదు వారాలే అయినా రెమ్యూన‌రేష‌న్ మాత్రం గ‌ట్టిగానే పుచ్చుకుంద‌ని తెలుస్తోంది.

Hamida (Bigg Boss) Wiki, Biography, Age, Movies, Images - Moviespie.Com

ఒక్క వారానికిగానూ హమీదా 80 వేల నుంచి లక్ష రూపాయల మేరకు రెమ్యునరేషన్‌ తీసుకున్నట్టు చర్చ జరుగుతుంది. ఈ లెక్కన ఆమెకు ఐదు వారాలకుగానూ నాలుగున్నర లక్షలకు పైగానే బిగ్ బాస్ చెల్లించిన‌ట్టు తెలుస్తోంది.

బిగ్‌బాస్ 5: హమీదా రెమ్యూన‌రేష‌న్..ఐదు వారాల‌కే అంత పుచ్చుకుందా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts