మ‌హేష్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..దీపావళికి బిగ్ ట్రీట్ ఖాయ‌మ‌ట‌..?!

October 12, 2021 at 8:44 am

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై నిర్మ‌త‌మ‌వుతున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానుంది.

Sarkaru Vaari Paata FIRST LOOK: Mahesh Babu looks uber cool & is set to take off on a new journey of action | PINKVILLA

ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి మ‌హేష్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే గుడ్ న్యూస్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. విష‌యం ఏంటంటే.. దీపావ‌ళి కానుక‌గా స‌ర్కారు వారి పాట నుంచి బిగ్ ట్రీట్ రాబోతోంద‌ట‌. త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఫ‌స్ట్ సింగిల్ కోసం అభిమానులు ఎప్ప‌టి నుంచో వెయిట్ చేస్తున్న విష‌యం తెలిసిందే.

Mahesh Babu's Birthday Surprise With The Teaser Of Sarkaru Vaari Paata | Filmfare.com

అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం దీపావళి కానుక‌గా న‌వంబ‌ర్ 4న ఫ‌స్ట్ సింగిల్ సాంగ్‌ను విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. దీనిపై త‌ర్వ‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న కూడా రానుంద‌ని స‌మాచారం.

మ‌హేష్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..దీపావళికి బిగ్ ట్రీట్ ఖాయ‌మ‌ట‌..?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts