`ఆడవాళ్లు మీకు జోహార్లు` ఫస్ట్‌ లుక్ అదిరిపోయిందిగా!!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్‌, ల‌క్కీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `ఆడవాళ్లు మీకు జోహార్లు`. కిశోర్‌ తిరుమల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై చెరుకూరి సుధాకర్‌ నిర్మిస్తున్నారు.

Rashmika & Sharwanand New Movie Opening Video | Aadavaallu Meeku Joharlu | Manastars - YouTube

కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో శ‌ర వేగంగా జ‌రుగుతోంది. అయితే నేడు ద‌స‌రా పండ‌గా సంద‌ర్భంగా `ఆడవాళ్లు మీకు జోహార్లు` ఫస్ట్‌ లుక్ ను తాజాగా మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

Image

ఈ పోస్ట‌ర్‌లో శ‌ర్వా, ర‌ష్మిక‌లు చిరున‌వ్వులు చిందిస్తూ ఎంతో అందంగా క‌నిపిస్తున్నారు. ఆక‌ట్టుకుంటున్న ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. కాగా, ఈ చిత్రంలో రాధిక .. ఉర్వశి .. ఖుష్బూ ముఖ్యమైన పాత్రల్లో సందడి చేయనున్నారు. అలాగే వ‌చ్చే ఏడాది ఈ సినిమా విడుద‌ల కానుంది.