త‌మ‌న్నాకు ఘోర అవ‌మానం..అర‌రే మరీ ఇంత దారుణమా..?

October 7, 2021 at 7:46 am

త‌మ‌న్నాకు ఘోర అవ‌మానం జ‌రిగింది. అస‌లు విష‌యం ఏంటంటే.. ప్ర‌స్తుతం త‌మ‌న్నా ఓవైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు వ‌రుస వెబ్ సిరీస్‌లు, యాడ్స్ చేస్తూ బిజీగా గ‌డుపుతోంది. ఇక ఈ మ‌ధ్య బుల్లితెర‌పైకి కూడా మిల్కీ బ్యూటీ ఎంట్రీ ఇచ్చింది.

Tamannaah Master Chef Telugu Ad | MS entertainments - YouTube

వరల్డ్స్‌‌ మోస్ట్‌‌ పాపులర్ కుకింగ్‌‌ రియాలిటీ షో `మాస్టర్‌‌‌‌చెఫ్‌‌`. అమెరికా, ఆస్ట్రేలియాతోపాటు అనేక దేశాల్లో ఈ షో సూపర్‌‌‌‌హిట్టైంది. దాంతో ఈ షోను జెమినీ టీవీ వారు తెలుగులోకి కూడా తీసుకువ‌చ్చారు. త‌మ‌న్నా ఈ షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. అయితే భారీ అంచ‌నాల న‌డుమ స్టార్ట్ అయిన ఈ షోకు ఊహించిన దానికంటే దారుణ‌మైన రేటింగ్స్ వ‌స్తున్నాయ‌ట‌.

Tamanna Bhatia And Allu Sirish At Masterchef Telugu Press Mee | Tamannaah Bhatia Show Host | FT - YouTube

ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు, బిగ్ బాస్ 5 తెలుగు, మాస్ట‌ర్ చెఫ్‌, ఐపీఎల్ ఇవ‌న్నీ అటూ ఇటూగా ఒకేసారి ప్రారంభం అయ్యాయి. అయితే వీటిలో అన్నింటికంటే తక్కువ రేటింగ్ తీసుకొస్తున్న షో మాస్ట‌ర్ చెఫ్ అని తెలుస్తోంది. త‌మ‌న్నా క్రేజ్ ఈ షోకు ఏ మాత్రం ప‌నికి రాలేద‌ని.. అందుకే ఆమెకు నిర్వాహ‌కులు గుడ్‌బై చెప్పేయ‌బోతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏదేమైనా గ‌త కొన్నేళ్ల నుంచి స్టార్ హీరోయిన్‌గా చ‌క్రం తిప్పుతున్న త‌మ‌న్నా.. బుల్లితెర‌పై స‌త్తా చాట‌లేక‌పోవ‌డం ఘోర అవ‌మాన‌మ‌నే చెప్పాలి.

త‌మ‌న్నాకు ఘోర అవ‌మానం..అర‌రే మరీ ఇంత దారుణమా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts