ఎన్నికల ఫలితాలపై స్పందించిన హేమ.. ఏమన్నారో తెలుసా?

ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ ఎన్నికలలో మంచు విష్ణు గెలుపొందిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇక తాజాగా నటి హేమ మా ఎన్నికల ఫలితాల పై నటి హేమ స్పందించింది. మా ఎన్నికలలో తమ ప్యానల్ ఎలా ఓడిపోయిందో ఆ దుర్గమ్మకే తెలియాలి అంటూ అనే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆమె విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మని దర్శించుకుని, అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దుర్గమ్మ ని దర్శించుకున్న చాలా సంతోషంగా ఉంది అన్నారు.

దసరా పండుగ సందర్భంగా ఆమె ప్రతి ఏడాది అమ్మవారిని దర్శించుకుంటానని, ఆనందంతో కన్నీళ్లు కూడా వస్తుంటాయి అంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యింది. మా ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ రాత్రి గెలిచామని చెప్పి ఉదయానికి ఎలా ఓడిపోయామో నాకు తెలియడం లేదని, దానికి కారణం దుర్గమ్మ కైనా తెలుసో లేదో అంటూ హేమ వ్యంగ వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల్లో ఆమె ప్రకాశ్ రాజ్ ప్యానల్ తరపున పోటీ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ ప్యానల్ నుంచి పోటీ చేసిన అనసూయ ఫలితాలపై చేసిన ట్వీట్లు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.

Share post:

Latest