పాన్ ఇండియా సినిమాగా శివకార్తికేయన్ డాక్టర్ సినిమా?

తమిళ హీరో, నటుడు, నిర్మాత,గాయకుడు శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన తాజాగా నటించిన సినిమా డాక్టర్. ఈ సినిమాను శివకార్తికేయన్ ప్రొడక్షన్, కేజేఆర్ స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మించారు. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించారు. ఇందులో శివ కార్తికేయన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందించారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 9న థియేటర్స్ లో విడుదల కానుంది.

ఈ సందర్భంగా నటుడు శివకార్తికేయన్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ డాక్టర్ సినిమాలో నటించడం నాకు కొత్త అనుభవం. ఇందులో నేను ఆర్మీ డాక్టర్ గా నటించాను.ఇందులో నేను ఏం చేస్తాను ఎవరిని కాపాడుతాను అన్నది సినిమా కథ. నేను ఇప్పటి వరకు నటించిన చిత్రాల్లో యు ఏ సర్టిఫికెట్ పొందిన తొలి చిత్రం ఇదే. దీనికి గల కారణం చిత్రకథ అలాంటిది.అయితే ఈ సీరియస్ సినిమా కాదు,కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చేసే చిత్రం అంటూ శివకార్తికేయన్ చెప్పుకొచ్చారు.ఇందులో గ్రాఫిక్ సన్నివేశాలు అధికంగా ఉంటాయి. ఇది పాన్ ఇండియా చిత్రంగా ఉంటుంది. భవిష్యత్తులో మెగా ఫోన్ పట్టాలని ఆలోచన ఉంది అని శివకార్తికేయన్ అన్నారు.

Share post:

Popular