ఆ హీరోయిన్ తో ఒకరోజు గడిపితే ఛాన్స్ ఇస్తానన్న డైరెక్టర్..!

ఇండస్ట్రీలో ఇవన్నీ సర్వసాధారణంగా ఎవరో ఒకరు క్యాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తూనే ఉంటారు. తమకు జరిగిన వాటి గురించి మీడియా ముందు వెల్లడిస్తున్నారు. కాస్టింగ్ కౌచ్ పై కొంతమంది సినీ తారలు ఉద్యమాలు చేసినా కూడా అది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఈ అంశంపై సినీ ప్రముఖులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తూ ఉంటారు. క్యాస్టింగ్ కౌచ్ బారిన పడిన వారందరూ ధైర్యంగా ముందుకు రావాలని ఫిర్యాదు చేయాలని చెబుతుంటారు. మరికొందరు జాగ్రత్తగా ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది అని అంటుంటారు. ముఖ్యంగా ఎక్కువగా నటీమణులు క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొంటారు. తాజాగా ఓ హిందీ నటి దర్శకుడి వల్ల ఇబ్బందులకు లోన్ అయ్యానని తెలిపారు.

హిందీ నటి  లైంగిక ఇబ్బందులకు గురి అయ్యానని చెప్పింది. కెరీర్ ప్రారంభంలోనే అవకాశం కోసం ఎదురు చూస్తున్న సమయంలో సౌత్ దర్శకుడు నుండి ఆఫర్ వచ్చిందని, ఫోటోలు మరియు వివరాలు పంపించమని దర్శకుడు కోరాడని చెప్పింది. ఆ తర్వాత హైదరాబాద్ కు రమ్మని ఫోన్ చేశాడని తెలిపింది.

హైదరాబాద్ వచ్చిన వెంటనే ఒక రోజంతా దర్శకుడుతో గడపాలనీ చెప్పింది. తను ఏం చెప్పినా ఓకే అనాలని అన్నాడు. ఆ మాటవిని షాకయ్యాను. ఇలాంటి పనులు నేను చేయనని దర్శకుడితో డైరెక్టుగా చెప్పాను.. కానీ వారం రోజుల తరువాత మళ్లీ కాల్ చేసి ఇంకా నీ ఆఫర్ అలాగే ఉంది. నువ్వు ఓకే అంటే ఈ చాన్స్ నీకే అని చెప్పాడని తెలిపింది. దాంతో తను గట్టిగా అరిచి ఫోన్ పెట్టేసాను. అని వెల్లడించింది.