వైరల్ : ఏకంగా 735 గుడ్లను ఒకే టోపిలో ధరించిన ఘనుడు…!

గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాందించాలంటే ఎవరు చేయని పని అయ్యుండి, లేదంటే ఏదైనా కొత్తగా చేయాలి. అలాగే ఒక ఘనుడు వినూత్నంగా ప్రయత్నించి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఏకంగా 735 గుడ్లను ఒకే టోపిలో ధరించి కొన్ని నిమిషాల పాటు బ్యాలన్స్ చేసి గిన్నీస్ రికార్డు సృష్టించాడు ఈ వీరుడు.

- Advertisement -

ఆఫ్రికాకు చెందిన గ్రెగరీ డాసిల్వా తన తలపై ఏకంగా 735 గుడ్లను బ్యాలెన్స్ చేశాడు. ఇందుకోసం అతను ఒక పెద్ద టోపీని తయారుచేయించి అందులో 735 గుడ్లను అతికించాడు. ఇలా అతని టోపీలో గుడ్లను అతికించడానికి మూడు రోజులు సమయం పట్టిందంట. అతను ఎంతో జాగ్రత్తగా, ఓపికగా పెద్ద టోపిలో 735 గుడ్లను అతికించాడు. అలా అతికించిన గుడ్లను గ్రేగరి కొన్ని నిమిషాల పాటు అలాగే బ్యాలన్స్ చేసాడు. దీంతో ఈ సాహసానికి గాను అతనికి వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్నాడు.

దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా నిమిషాల్లోనే వేల సంఖ్యలో లైకులు, లక్షల వ్యూస్ వచ్చాయి. అందుకే గిన్నిస్ బుక్ వారు ఈ అరుదైన సంఘటనను గుర్తించి గ్రేగరి ను వరల్డ్ రికార్డుల్లో నమోదు చేశారు. అయితే ఇలాంటి సంఘటనే గత ఏడాది మే లో కూడా జరిగింది. లండన్ వాసి అయిన జాక్ హరీష్ అనే లండన్ వ్యక్తి తన చేతి వెనుక 18 గుడ్లను బ్యాలెన్స్ చేసి రికార్డు సృష్టించాడు.

Share post:

Popular