తిరుపతి వైసీపీలో ఏదో జరుగుదోంది?

రాయలసీమ జిల్లాల్లో ప్రధానమైనది చిత్తూరు జిల్లా.. అందులోనూ తిరుపతి.. అంత ప్రాధాన్యమున్న తిరుపతి వైసీపీలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్, కార్పొరేటర్ల మధ్య పచ్చగడ్డి వేస్తో భగ్గుమంటోంది. ఎమ్మెల్యే వ్యవహార శైలితో విసిగిపోయిన కార్పొరేటర్లు ఆయనను విమర్శించే స్థాయికి వెళ్లారంటే పరిస్థితి పార్టీలో ఎటువైపు పోతోందో కిందిస్థాయి కార్యకర్తలకు అర్థం కావడం లేదు. కార్పొరేటర్లందరికీన భూమన డామినేట్ చేస్తుండటంతో చివరికు వారంతా ఒక్కటై.. ఎమ్మెల్యేను ఒంటరి చేశారు.

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక మెజారిటీ సీట్లను గెలుచుకుంది. 49 డివిజన్లలో 48 సీట్లు వైసీపీపరమయ్యాయి. టీడీపీ కేవలం ఒక్క చోటే గెలిచింది. అయితే కార్పొరేషన్ లో చేపట్టే పనులపై కార్పొరేటర్లు ఎమ్మెల్యేను సంప్రదించకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. తిరుపతిలో భూ వివాదాలు, అనుమతి లేని భవన నిర్మాణాలు చాలానే ఉంటాయి. ఈ వ్యవహారాల్లో ఎమ్మెల్యే, కార్పొరేటర్ల మధ్య నిత్యం ఘర్షణ వాతావరణం నెలకొంటూ ఉంది. జీవకోన, ఆటోనగర్, ఎంఆర్ నగర్, తిమ్మనాయుడు పాలెం, రాజీవ్ నగర్, ఉపాధ్యాయనగర్ ప్రాంతాల్లో ఈ సమస్య మరీ ఎక్కువ ఉంటుంది. అందుకే గొడవలు ముదిరి ఈ స్థాయికి వచ్చాయట. ఎమ్మెల్యే, కార్పొరేటర్ మధ్య విభేదాలుండటంతో అధికారులు, సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. విడవమంటే పాముకు కోపం.. కరవమంటే కప్పకు కోపం అన్నట్లుంది పరిస్థితి. మరి అధిష్టానం తిరుపతిని గమనిస్తోందో.. లేదో.