జగన్ ని కలిసే చిరంజీవి టీమ్ ఇదే..!

సినిమా టికెట్ల వ్యవహారంపై ఏపీ సర్కారు తెచ్చిన జీఓ సినిమా పెద్దలను నిద్రలేకుండా చేస్తోంది. థియేటర్ యజమానులు, ఎగ్జిబిటర్లు టాలీవుడ్ ప్రముఖులపై ఒత్తిడి తెస్తున్నారు. టికెట్లు ప్రభుత్వమే అమ్మితే మేం ఎందుకు? మేం థియేటర్లు మూసేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో సినీ ప్రముఖులు సీఎంను కలిసేందుకు కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 20న జగన్ తో సమావేశమై చర్చించనున్నారు. అయితే సీఎం మీటింగ్ లో ఎవరెవరు పాల్గొంటున్నారనేది బయటకు రావడం లేదు. అయితే ఇంతకుముందే టాలీవుడ్ టాప్ హీరోలకు సిద్దంగా ఉండండి అని మెగాస్టార్ సమాచారం కూడా ఇచ్చారట. అందుకు వారూ సరే అన్నారు. ఇప్పటికున్న సమాచారం ప్రకారం చిరంజీవితోపాటు రామ్ చరణ్, ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లు మెగా టీం తరఫున జగన్ తో మాట్లాడతారు. అయితే వీరు యాక్టర్స్ తరపున మాత్రమే తమ సమస్య వివరిస్తారు. ఇక నిర్మాతల సైడ్ నుంచి దిల్ రాజు, దగ్గుబాటి సురేష్ బాబు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు చెబుతారు. ఈ సమావేశంలో ముఖ్యంగా నిర్మాతలకు వచ్చే ఇబ్బందులే చర్చకు రానున్నాయి. టికెట్ల విషయంతోపాటు విద్యుత్ బిల్లు రాయితీ కూడా మాట్లాడే అవకాశముంది.

నాగార్జున పేరు మిస్సింగ్

సీఎంను కలిసే టీమ్ లో హీరోల జాబితాలో నాగార్జున పేరు లేకపోవడం ఇండస్ర్టీలో చర్చనీయాంశమైంది. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ లు .. అంటే ముగ్గురు హాజరవుతున్నట్లు తెలిసింది. మరి కింగ్ నాగార్జున కూడా సినీ ప్రముఖుడే కదా.. ఆయనకు స్టూడియో కూడా ఉంది. మరి నాగార్జునను మెగా టీం ఎందుకు సైడ్ చేసిందోనని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Share post:

Latest