టాలీవుడ్‌లో కొన్నాళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పిన ముద్దుగుమ్మ శ్రియ.. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసి తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను సంపాదించుకుంది. అందం, అభినయం, నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న శ్రియ..రష్యాకు చెందిన టెన్నిస్ ప్లేయర్, వ్యాపారవేత్త అయిన ఆండ్రే చాలా కాలం డేటింగ్ చేసింది.
ఇక 2018లో ముంబయిలోని లోఖండ్‌వాలాలో శ్రియ, ఆండ్రే పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ భర్తతో రొమాంటిక్ టూర్స్ వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. అయితే పెళ్లి తర్వాత భర్తతో కలిసి స్పెయిన్‌లో సెటిల్ అయిన శ్రియ.. ఇప్పుడు ముంబైకి షిఫ్ట్ అయింది. ఇందులో భాగంగానే ముంబైలోని బాంద్రా ఏరియాలో ఓ విలాసవంతమైన భవనం కూడా కొనుగోలు చేశారని తెలుస్తోంది.
అయితే ఇంత సడెన్‌గా శ్రియ ముంబైకి షిఫ్ట్ అవ్వడం వెనకున్న సీక్రెట్ ఏంటీ అంటే.. ప్రస్తుతం ఈ భామ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్` లో ఓ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా విడుదలైతే శ్రియ సూపర్ కంబ్యాక్ ఇస్తుంది. దాంతో ఆమెకు మరిన్ని అవకాశాలు క్యూ కట్టనున్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రియ ముంబైలో కాపురం పెట్టిందని టాక్ నడుస్తోంది.