బేబ‌మ్మ‌తో ఇక‌పై సినిమా చేయ‌ను..తెగేసి చెప్పిన విజ‌య్ సేతుప‌తి!

విజ‌య్ సేతుప‌తి.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌మిళ స్టార్ హీరో అయిన‌ప్ప‌టికీ.. తెలుగులోనూ సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఇటీవ‌ల విడుద‌లైన ఉప్పెన చిత్రంలో బేబ‌మ్మ అదేనండీ మ‌న కృతి శెట్టికి తండ్రిగా న‌టించిన విజ‌య్ సేతిప‌తి.. త‌న విల‌క్ష‌న‌మైన న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యాడు.

I am like a kid whenever I stand in front of the camera: Vijay Sethupathi |  Entertainment News,The Indian Express

అయితే ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో వ‌రుస సినిమాలు చేస్తున్న విజ‌య్ సేతుప‌తి.. కృతి శెట్టితో ఇక‌పై సినిమా చేయ‌న‌ని తెగేసి చెప్పార‌ట‌. అస‌లు ఏం జ‌రిగిందంటే..తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న ఓ సినిమాలో హీరోయిన్ గా కృతిని ఎంపిక చేశార‌ట మేక‌ర్స్‌. ఈ విష‌యం తెలుసుకున్న విజ‌య్ సేతుప‌తి వెంట‌నే మేక‌ర్స్‌ను సంప్ర‌దించి కృతి శెట్టి హీరోయిన్‌గా వ‌ద్ద‌ని చెప్పేశార‌ట‌.

Vijay Sethupathi says NO to Krithi Shetty! -

ఈ విష‌యాన్ని స్వ‌యంగా విజ‌య్‌నే చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఆయ‌న‌..` ఈ మ‌ధ్య తమిళంలో ఓ ప్రాజెక్టు చేశాను. అయితే సినిమా యూనిట్ సభ్యులకు నేను ఉప్పెన సినిమాలో కృతి శెట్టికి తండ్రిగా నటించిన విషయం తెలియదు. అందుకే ఆమెను నా సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేశారు. కాని నేను చేయను అని చెప్పేశా. ఉప్పెన‌లో ఆమెను సొంత కూతురుగా భావించే కొన్ని స‌న్నివేశాలు చేశాను. ఇప్పుడు ఆమెతో రొమాన్స్‌ చేయమంటే నేను చేయలేనని చెప్పా. దాంతో మేక‌ర్స్ మ‌రో హీరోయిన్‌ను ఎంపిక చేశారు.` అంటూ విజ‌య్ చెప్పుకొచ్చాడు.

Share post:

Popular