చైతూ లవ్ స్టోరీపై వెంకీ ఏం అన్నాడంటే?

September 18, 2021 at 10:01 am

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా సెప్టెంబర్ 24వ తేదీన విడుదల కానుంది. శేఖర్ కమ్ముల,సాయిపల్లవి కాంబినేషన్ లో మరొకసారి సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. అంతే కాకుండా ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 19న జరగనుండగా, ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రానున్నారు. అలాగే నాగార్జున కూడా ఈ ఈవెంట్ కు హాజరు కానున్నారు.

ఇది ఇలా ఉంటే ఇటీవలే విడుదలైన లవ్ స్టోరీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ట్రైలర్ విడుదల 24 గంటల్లోపు దాదాపుగా మూడు నలభై రెండు ఒకే లైక్స్ ను సొంతం చేసుకుంది. అంతే కాకుండా టాప్ ఫైవ్ లైక్ వచ్చిన టైలర్ లలో ఇది ఒకటిగా రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా ఈ ట్రైలర్ ను చూసిన విక్టరీ వెంకటేష్ కూడా ప్రశంసించారు. లవ్ ద టైలర్ అంటూ చై & చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ అని తెలిపారు.

చైతూ లవ్ స్టోరీపై వెంకీ ఏం అన్నాడంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts