నేను డ్రగ్స్ కొనలేదు.. అసలు అవి నిజాలు కాదు: తనీష్

September 18, 2021 at 10:04 am

టాలీవుడ్ డ్రగ్స్ విచారణ కేసులో భాగంగా తాజాగా నటుడు తనీష్ ఈడీ అధికారులు ముందుకు హాజరు కాగా దాదాపుగా ఏడున్నర గంటల పాటు ఈ విచారణ సాగింది. ఈ విచారణలో భాగంగా కేసులో తనపై వచ్చిన ఆరోపణలు నిజాలు కావని నటుడు తనీష్ తెలిపారు. తెలివి నుంచి తాను డ్రగ్స్ ఖరీదు చేయడం కానీ, దాని కోసం డబ్బులు వెచ్చించడం కానీ జరగలేదని స్పష్టం చేశారు.డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు అయిన కెల్విన్ తో ఉన్న పరిచయం అతడితో లావాదేవీలపై తనీష్ ను ఈడీ అధికారులు ఆరా తీశారు. అంతేకాకుండా 2016 – 17 మధ్య కెల్విన్ తో వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసినట్టు ప్రాథమిక ఆధారాలు సేకరించిన ఈడి దీని పై వివరణ ఇవ్వాలని కోరింది.

దీనిపై స్పందించిన తనీష్ తాను చేసిన పలు సినిమాలకు కెల్విన్ ఈవెంట్స్ నిర్వహించాడని, ఆ విధంగానే అతనితో పరిచయం ఏర్పడిందని తనీష్ తెలిపారు. ఈ వ్యవహారంలో ఎక్కడా డ్రగ్స్ కొనడం కానీ వినియోగించడం ఇలాంటివి లేవని స్పష్టం చేశారు. అలాగే కెల్విన్ విచారణలో తన పేరు బయటికి రావడానికి అతనితో ఈవెంట్ ల పరంగా ఉన్న పరిచయమే కారణమని తనీష్ వివరణ ఇచ్చారు. ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఈడి కార్యాలయంలో కి వెళ్ళిన తనీష్ సాయంత్రం 6 గంటలకు తిరిగి వచ్చారు.

నేను డ్రగ్స్ కొనలేదు.. అసలు అవి నిజాలు కాదు: తనీష్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts