మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కోసం పూజా హెగ్డే ప్రయోగం.. ఫలిస్తుందా?

September 18, 2021 at 10:07 am

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమా అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అఖిల్ ఇంతకు ముందు తీసిన సినిమాలు పరాజయం పాలవడంతో ఈ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలు అఖిల్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. తాజాగా ఈ సినిమా కోసం ఆమె డబ్బింగ్ ను ప్రారంభించిన విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేసింది.

ఆ విషయానికి వస్తే ఇందులో లవ్ సీన్స్ లో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వీరి మధ్య రొమాన్స్ హైలెట్ గా నిలుస్తుందని చిత్ర బృందం విశ్వాసంగా ఉందట. ఈ సినిమాను గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు, వాసు వర్మ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ప్రదీప్ వర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమా నుంచి ఒక వీడియో సాంగ్ రిలీజ్ చేయగా ఆ సాంగ్ ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది. అంతేకాకుండా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కోసం పూజా హెగ్డే ప్రయోగం.. ఫలిస్తుందా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts