మరోసారి భారీ ధరకు అమ్ముడు పోయిన సిటీ మార్..?

September 18, 2021 at 10:07 am

టాలీవుడ్ లో యాక్షన్ హీరోగా పేరు పొందిన హీరో గోపీచంద్.చాలా కాలం తర్వాత సిటీమార్ సినిమాతో బాగా హడావిడి చేశాడు.మొదట ఈ సినిమాకి ఓటిటి నుంచి భారీ ఆఫర్లు వచ్చినా కూడా దర్శకనిర్మాతలు ఏమాత్రం వాటి మీద ఇంట్రెస్ట్ చూపి కుండా థియేటర్లోనే విడుదల చేశారు. సీటీమార్ సినిమా విడుదలైన మూడు రోజుల వరకు బాగానే ఓపెనింగ్స్ రాబట్టింది.

కానీ వీకెండ్ కలెక్షన్స్ వచ్చేసరికి ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి.దాదాపుగా 13 కోట్ల రూపాయలు థియేటర్స్ బిజినెస్ జరగగా,ఈ మూవీ ఇప్పటి వరకు తొమ్మిది కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇంకా ఈ సినిమాకి 5 కోట్ల రూపాయల మేర వరకు వస్తే లాభం పొందినట్లు. ఇక అంత కలెక్షన్లు రావడం అంటే కష్టమే..అందుచేతనే వీలైనంత త్వరగా ఓటిటీలో ఈ సినిమాను,నిర్మాతలు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Amazon Prime Video eyes OTT dominance with aggressive original content  slate - Exchange4media

ఈ సినిమాని ఓటిటి అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారట.ఇక గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ ఆమౌంట్ ను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.అమెజాన్ వారు దాదాపుగా ఈ సినిమాకి ఇప్పుడు 8 కోట్ల రూపాయల వరకు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.ఏది ఏమైనా అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను విడుదల చేసుకుంటే నిర్మాతలకు లాభం చేకూరుతుంది.

 మరోసారి భారీ ధరకు అమ్ముడు పోయిన సిటీ మార్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts