రానా నాయుడు వెబ్ సిరీస్ కూడా రీమేకే.. తెలుగులో రైటర్లే లేరా?

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ తన సినీ కెరీర్ లో ఎక్కువశాతం రీమేక్ సినిమాల్లో నటించారు. ఇక ఆయన తాజాగా నటించిన నారప్ప,దృశ్యం 2, సినిమాలు కూడా రీమేక్ గా సినిమాలనే సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే వెంకటేష్ రానాతో కలిసి ఒక వెబ్ సిరీస్ చేయబోతున్నారు. నెట్ ఫ్లిక్ సంస్థ ఈ సిరీస్ ను నిర్మించబోతోంది. దీనికి రానా నాయుడు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు. అయితే ఈ సిరీస్ కూడా రీమేక్ కావడం విశేషం.’

హాలీవుడ్ లో తెరకెక్కిన క్రైమ్ సిరీస్ రే డోనవన్ అక్కడ సూపర్ సక్సెస్ అయ్యింది. చాలా మంది ఇండియన్స్ ఇప్పటికే ఈ సిరీస్ ను చూసేసారు. ఇప్పుడు ఈ సిరీస్ కు వెర్షన్ గా రానా నాయుడు అని తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ లో ఇది సక్సెస్ అయ్యింది కాబట్టి ఇదే కథ తెలుగులో కూడా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నారు. ఇక వెంకటేష్ సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఎఫ్ 3 సినిమాలో నటిస్తున్నారు. రానా భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తున్నాడు.

Share post:

Latest