అదిరిపోయిన `టక్ జగదీష్‌` ట్రైల‌ర్..నానికి హిట్ ఖాయ‌మా?!

న్యాచుర‌ల్ స్టార్ నాని, డైరెక్ట‌ర్ శివ నిర్వాణ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `ట‌క్ జ‌గ‌దీష్‌`. రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మించారు. భారీ అంచ‌నాలు ఉన్న ఈ చిత్రం థియేట‌ర్‌లో విడుద‌ల కావాల్సి ఉన్నా.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల కార‌ణంగా ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 10 వ తేదీన విడుద‌ల కాబోతోంది.

Watch: Trailer of Nani's Tuck Jagadish is high on drama, emotion | The News  Minute

ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ తాజాగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. `భూదేవిపురం గురించి మీకో కథ చెప్పాలి` అంటూ వీరేంద్ర అనే విలన్ గా డేనియల్ బాలాజీ ని చూపించడంతో స్టార్ట్ అయిన ట్రైల‌ర్ ఆధ్యంతం ఆక‌ట్టుకుంది. ఫ్యామిలీని పిచ్చిగా ప్రేమించే జగదీష్ నాయుడు అనే యువకుడి కథే ఈ చిత్రమని ట్రైల‌ర్ బ‌ట్టీ స్ప‌స్టంగా తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ కి సాంబంధించిన సన్నివేశాలను కట్ చేసి ట్రైల‌ర్‌లో అద్భుతంగా చూపించారు.

Tuck Jagadish Trailer: Nani is the 'Family Man' now! | Moviezupp

నాయుడుగారి అబ్బాయి టక్‌ జగదీష్‌గా నాని తన లుక్‌తో, పర్ఫామెన్స్‌తో, ఎమోషనల్‌ సీన్స్‌తో అదరగొట్టాడు. జగదీష్ తండ్రిగా నాజర్ కనిపిస్తుండగా.. అన్న బోసుగా జగపతిబాబు న‌టిస్తున్న‌ట్టు ట్రైల‌ర్ లో చూపించారు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువ‌ల్స్, ఫైట్స్‌, డైలాగ్స్‌ సైతం ఆక‌ట్టుకున్నాయి. మొత్తానికి అదిరిపోయిన ట్రైల‌ర్ సినిమాపై మ‌రిన్ని అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. దాంతో ట్రైల‌ర్ చూసిన నెటిజ‌న్లు మ‌రియు అభిమానులు ఈ సారి నానికి హిట్ ఖాయ‌మంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Share post:

Latest