`పుష్ప‌`పై న్యూ అప్డేట్‌..ఫ‌స్ట్ పార్ట్ విల‌న్ ఫాహద్ కాద‌ట‌?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప‌`. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంటే.. మ‌ల‌యాళ న‌టుడు ఫహద్ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు.

Fahadh Faasil's look from the 'Pushpa' poster is an instant hit

అయితే ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. మొద‌టి భాగం క్రిస్మ‌స్ కానుక‌గా విడుద‌ల కానుంది. ప్ర‌స్తుతం సుక్కు ఫ‌స్ట్ పార్ట్ షూటింగ్‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాడు. ఇలాంటి త‌రుణంలో ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చి నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. పుష్ప ఫ‌స్ట్ పార్ట్‌లో ఫాహ‌ద్ విల‌న్ కాద‌ట‌.

Actor Sunil hospitalised, under observation- Cinema express

ఫస్ట్ పార్ట్ లో మొత్తం సునీల్ విలన్ గా కనిపిస్తారట. నిజానికి పుష్ప సినిమాలో మెయిన్ విలన్ గా ఫహద్ ఫాజిల్ ను ఎంపిక చేసినప్పటికీ.. ఆయన పాత్ర మొదటి భాగం ఎండింగ్ లో వస్తుందనే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే మ‌రి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Share post:

Latest