బిగ్‌బాస్‌-5: ఆ కంటెస్టెంట్‌కే నా స‌పోర్ట్ అంటున్న సందీప్‌ కిషన్‌!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో నాలుగో వారం కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమాదేవి, ల‌హ‌రిలు ఎలిమినేట్ కాగా.. మిగిలిన కంటెస్టెంట్లు హౌస్‌లో స‌త్తా చాటేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే మొద‌టి వారం నుంచే ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్న ఈ షోను సామాన్యులే కాదు సెల‌బ్రెటీలు సైతం ఫాలో అవుతున్నారు.

Bigg Boss Telugu 5 premiere episode LIVE UPDATES: From Ravi Kiran, Swetaa  to Lahari Shari, here's complete list of contestants | Entertainment  News,The Indian Express

ఈ క్ర‌మంలోనే త‌మ‌కు న‌చ్చిన కంటెస్టెంట్‌కు స‌పోర్ట్ చేస్తుంటారు. టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో సందీప్ కిష‌న్ కూడా.. ఓ కంటెస్టెంట్‌కు త‌న స‌పోర్ట్‌ను తెలియ‌జేశాడు. ఇంత‌కీ ఆ కంటెస్టెంట్ ఎవ‌రో కాదు మాన‌స్‌. అవును, తాజాగా మాన‌స్‌కు మ‌ద్ద‌తు తెలుపుతూ ఓ వీడియోను సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేశాడు.

Maanas Nagulapalli Photos [HD]: Latest Images, Pictures, Stills of Maanas  Nagulapalli - FilmiBeat

ఈ వీడియోలో `హలో అందరికీ , నేను మీ సందీప్‌ కిషన్‌ను. బిగ్‌బాస్‌ షోలో నాకు నచ్చిన, బాగా కావాల్సిన వ్యక్తి మానస్‌ నాగులపల్లి పాల్గొన్నాడు. ఎంతో మంచి మనసున్న అతడు మీ అందరికీ నచ్చుతాడనుకుంటున్నాను. మానస్‌ చాలామంది మనసులు గెలుచుకుని బయటకు వస్తాడని కోరుకుంటూ ఆల్‌ ద బెస్ట్‌, లవ్‌ యూ..` అంటూ సందీప్ చెప్పుకొచ్చాడు. దాంతో సందీప్ కిష‌న్ ఫ్యాన్స్ సైతం మాన‌స్‌కు స‌పోర్ట్ చేస్తున్నారు.

https://www.instagram.com/reel/CUXPEn_J38R/?utm_source=ig_web_copy_link

Share post:

Latest