నేనేమైనా జ్యోతిష్యుడినా..? మండిప‌డ్డ కియారా..ఏమైందంటే?

September 23, 2021 at 11:53 am

బాలీవుడ్‌ బిజీ బ్యూటీ కియారా అద్వానీ, యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్ర ప్రేమ‌లో ఉన్నార‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. క‌లిసి వ‌రుస సినిమాలు చేయ‌డం, త‌ర‌చూ చ‌ట్టాప‌ట్టాలేసుకుని తిర‌గ‌డం.. ఇవ‌న్నీ ఆ ప్ర‌చారానికి మ‌రింత బ‌లాన్ని చేకూర్చాయి. అయితే గ‌తంలో త‌మ మ‌ధ్య స్నేహ‌మే కానీ, ప్రేమ లేద‌ని కియారా మండిప‌డింది.

10 photos of rumoured couple Kiara Advani and Sidharth Malhotra that are  proof of their chemistry

ఇక తాజా ఇంట‌ర్వ్యూలో సిద్దార్థ్ కూడా ఈ విష‌యంపై స్పందించాడు. కియారా వర్క్ పట్ల చూపించే శ్రద్ద మరియు ఆమె నటన నాకు చాలా ఇష్టం. తప్పకుండా అలాంటి స్నేహితులు అందరు కోరుకుంటారు అని చెప్పుకొచ్చాడు. అలాగే మా ఇద్దరి మద్య ప్రేమ లేనే లేదు అంటూ స్పష్టంగా చెప్పేశాడు.

Kiara Advani wore a pink sari with a sexy blouse for Shershaah promotions  with Sidharth Malhotra | VOGUE India

ప్రస్తుతం ఇద్దరం కూడా సినిమా లతో బిజీగా ఉన్నాం. ఇద్దరం కథలు కలిసి వస్తే తప్పకుండా మళ్లీ మళ్లీ నటించేందుకు సిద్దంగానే ఉన్నాం అని తెలిపాడు. ఇక పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నించ‌గా..నేనేమైనా జ్యోతిష్యుడినా? నాకు నా పెళ్లి ఎప్పుడు జరుగుతుంది అనే విషయం తెలియదు. ఒక వేళ ఆ విషయం కనుక నాకు తెలిస్తే ఖచ్చితంగా మీకు చెప్తాను అని సిద్దార్థ్ పేర్కొన్నాడు.

నేనేమైనా జ్యోతిష్యుడినా..? మండిప‌డ్డ కియారా..ఏమైందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts