మా ఎన్నికల కోసం సిద్ధమైన మంచు ప్యానెల్..!

September 23, 2021 at 12:06 pm

మా ఎన్నికల గొడవ గత కొన్ని నెలల నుంచి ఇండస్ట్రీలో పెను దుమారం లేపిన విషయం తెలిసిందే.. ఇక అప్పటికే నటి హేమ, జీవిత వంటి ఎంతోమంది నటీనటులు కూడా మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాము అని ప్రకటించి , ఆ తర్వాత ప్రకాష్ రాజు ప్యానల్ లోకి విలీనం అయిన విషయం తెలిసిందే.. ప్రకాష్ రాజ్ కు పోటీగా మంచు విష్ణు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.. ఇకపోతే మా ఎలక్షన్ల కోసం ప్రకాష్ రాజ్ మా బిడ్డలు అనే ఒక ప్యానెల్ లో ఏర్పాటు చేసి ఎవరెవరికి, ఏ పదవి ఇవ్వనున్నారు విషయాన్ని కూడా తెలియజేశాడు..

ఇకపోతే మంచు విష్ణు నుండి ఇప్పటివరకు ఎలాంటి విషయాలు తెలియక పోవడంతో ఆయన అభిమానులు కొంచెం సందేహంలో ఉన్నారు.. కానీ ఇప్పుడు ఆ సందేహాలకు తెర దించుతూ మంచు విష్ణు కూడా తన ప్యానెల్ ను ఏర్పాటుచేసి సభ్యులను కూడా ప్రకటించడం జరిగింది.. ఇకపోతే అక్టోబర్ 10వ తేదీన మా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో , గురువారం ఉదయం మంచు విష్ణు తన ప్యానల్ సభ్యులను ప్రకటించారు.. అయితే ఏయే పదవులకోసం మంచు విష్ణు ప్యానల్ నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారు అనే విషయాలను కూడా ఆయన వెల్లడించడం జరిగింది..

ఇక అధ్యక్షుడిగా మంచు విష్ణు పోటీ చేస్తుండగా.. జనరల్ సెక్రటరీగా – రఘుబాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా – బాబు మోహన్, వైస్ ప్రెసిడెంట్ గా మాదాల రవి, వైస్ ప్రెసిడెంట్ గా పృధ్వీరాజ్ బాలిరెడ్డి, కోశాధికారిగా శివ బాలాజీ, జాయింట్ సెక్రటరీగా కరాటే కళ్యాణి, గౌతంరాజు లు పోటీ చేయనున్నారు..

ఎగ్జిక్యూటివ్ మెంబర్ లుగా అర్చన , అశోక్ కుమార్, గీతా సింగ్, హరినాథ్ బాబు , జయవాణి, మలక్పేట శైలజ , మాణిక్ , పూజిత, రాజేశ్వరి రెడ్డి, సంపూర్ణేష్ బాబు, శశాంక్, శివన్నారాయణ , శ్రీలక్ష్మి, శ్రీనివాసులు, స్వప్నమాధురి, విష్ణు బొప్పన ,వడ్లపట్ల ,రేఖ తదితరులు ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పోటీ చేయనున్నారు.

మా ఎన్నికల కోసం సిద్ధమైన మంచు ప్యానెల్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts