కొత్త కారు కొన్న రామ్ చ‌ర‌ణ్‌..ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

కొత్త కార్ల‌పై మోజు ప‌డే హీరోలు మ‌న టాలీవుడ్‌లో చాలా మందే ఉన్నారు. మార్కెట్ లోకి కొత్త కార్ వ‌చ్చిందంటే అది త‌న ఇంట్లో ఉండాల్సిందే అనుకునే వారూ ఉన్నారు. మొన్నీ మ‌ద్య ప్ర‌భాస్‌, ఎన్టీఆర్‌లు ఖ‌రీదైన కార్లు కొనుగోలు చేసి వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే.

Ram Charan Visit Appolo Hospital To See Sai Dharam Tej Condition | Filmyfocus.com - YouTube

అయితే ఇప్పుడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ వంతు వ‌చ్చింది. చ‌ర‌ణ్ కూడా ల‌గ్జ‌రీ కారు కొనుగోలు చేశారు. తాజాగా ఈ కారుని చెర్రీకి హ్యాండోవ‌ర్ చేయ‌గా, బ్లాక్ కలర్ బెంజ్ కారులో రామ్ చరణ్ రయ్‌మని వెళ్లిపోయారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Ramcharan applauds his nieces for taking hygiene seriously | Telugu Movie News - Times of India

ఇక కారు విష‌యానికి వ‌స్తే.. బెంజ్‌కు సంబంధించిన ఈ కారు మెర్సిడెస్ మేబచ్ జీఎల్ఎస్ 600 మోడల్ అని తెలుస్తోంది. దీని ధర దాదాపు రెండున్నర కోట్లు ఉంటుందని సమాచారం. అలాగే ఈ కారుని చెర్రీ త‌న‌కు న‌చ్చిన‌ట్టుగా డిజైన్ చేయించుకున్న‌ట్టు స‌మాచారం.

https://twitter.com/UrsVamsiShekar/status/1437056646459494402?s=20