సాయి ధరమ్ తేజ్ కోసం అపోలోకు చ‌ర‌ణ్‌..వైర‌ల్‌గా ఎన్టీఆర్ ట్వీట్‌!

నిన్న రాత్రి కేబుల్ బ్రిడ్జి ద‌గ్గ‌ర మెగా మేన‌ల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌యాణిస్తున్న బైక్ ప్ర‌మాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో సాయి తేజ్‌కు తీవ్ర గాయాలై..అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దాంతో వెంట‌నే ఆయ‌న్ను పోలీసులు మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆసుపత్రిలో చేర్పించారు.

Ram Charan And Upasana Visits Apollo Hospital | Sai Dharam Tej Health Condition | News Buzz - YouTube

ఆ త‌ర్వాత అక్క‌డ నుంచి అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్ర‌స్తుతం సాయి తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. ఈ యాక్సిడెంట్ విష‌యం తెలియ‌గానే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, చిరంజీవి దంప‌తులు, అల్లు అర‌వింద్‌, వ‌రుణ్ తేజ్‌, నిహారిక‌, సందీప్ కిష‌న్ త‌దిత‌రులు హాస్ప‌ట‌ల్‌కు వెళ్లారు.

On Jr NTR's birthday, six films that are remembered for his powerhouse dialogues | Entertainment News,The Indian Express

తాజాగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఆయ‌న స‌తీమ‌ణి ఉపాస‌న కూడా సాయి ధ‌ర‌మ్ తేజ్ ను చూసేందుకు అపోలో హాస్పిటల్‌కు వెళ్లారు. ఇక మ‌రోవైపు తేజ్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానులు, సెల‌బ్రెటీలు ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ `సోదర త్వరగా కోలుకోవాలని` తేజ్‌ను చేస్తూ ట్వీట్ వేశారు. దాంతో ఎన్టీఆర్ ట్వీట్ వైర‌ల్‌గా మారింది.

 

Share post:

Latest