ప్రభాస్ విడ‌ద‌ల చేసిన `ఆకాశవాణి` ట్రైలర్ ఎలా ఉందంటే?

దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో తెరకెక్కిన తొలి చిత్రం `ఆకాశ‌వాణి`. స‌ముద్ర‌ఖ‌ని, విన‌య్ వ‌ర్మ‌, తేజ కాకుమాను, ప్ర‌శాంత్ త‌దిత‌రులు ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లు పోషించారు. అయితే తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ విడుద‌ల చేశారు.

Prabhas to launch Aakashavaani trailer today evening

`మనం బతికినా సచ్చినా.. తిన్నా పస్తున్నా.. ఎవరి వల్ల.. దేవుడి వల్ల.. దొర వల్ల` అంటూ ఓ పెద్దాయన చెప్పే డైలాగ్ తో స్టార్ట్ అయిన ట్రైల‌ర్ ఆధ్యంతం ఆక‌ట్టుకుంది. మూఢనమ్మకం, దొర‌ల అణచివేత మ‌ధ్య న‌లిగిపోయే అమాయ‌క‌మైన గిరిజ‌నుల జీవితాల‌ను రేడియో సెట్ ఎలా మారుస్తుంద‌నే క‌థ‌తో స‌స్పెన్స్ గా, క్యూరియాసిటీని క‌లిగించేలా సినిమా సాగుతుంద‌ని ట్రైల‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది.

Aakashavaani Telugu Movie (2021) | Cast | Trailer | Songs | Release Date -  News Bugz

గిరిజనులకు సహాయం చేసే పాత్రలో సముద్రఖని న‌టించారు. ట్రైలర్‌లోని లోకేషన్లు, డైలాగ్స్‌, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, విజువ‌ల్స్ ఇలా అన్ని ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి అదిరిపోయిన ఈ ట్రైల‌ర్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. కాగా, ఏయూ & ఐ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఎ.పద్మనాభరెడ్డి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 24న సోని లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.

Share post:

Latest