పెళ్లి సందD ట్రైలర్ ను రిలీజ్ చేసిన మహేష్?

హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్, లీలా జంటగా నటించిన చిత్రం పెళ్లి సందD. ఈ సినిమాను గౌరీ రోనంకి దర్శకత్వంలో ఆర్ కే ఫిల్మ్ అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో నటిస్తున్న హీరో రోషన్ తండ్రి శ్రీకాంత్ అప్పట్లో పెళ్లి సందడి సినిమాలు తీసి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమాకు కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు.

- Advertisement -

అంతే కాకుండా మొదటి సారి రాఘవేంద్రరావు సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేయబోతున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి వచ్చిన అప్డేట్స్, సాంగ్స్ అన్ని కూడా బాగానే ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ప్రిన్స్ మహేష్ బాబు విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ట్రైలర్ ని బట్టి చూస్తే సినిమా అంతా కూడా సందడి సందడిగా సాగుతోంది అనిపిస్తోంది. ఈ సినిమాలో హీరో డాన్స్, ఫైట్స్ బాగానే చేశాడని అర్థం అవుతోంది. ఇక అప్పట్లో వచ్చిన పెళ్లి సందD సినిమా ను మించి భారీ విజయాన్ని అందుకుంటుందా లేదా అంటే వేచి చూడాల్సిందే మరి.

Share post:

Popular