ఆర్ఆర్ఆర్ నుండి పండుగ కానుక లేదట!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండగా ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను పీరియాడికల్ ఫిక్షన్ సినిమాగా తెరకెక్కి్స్తుండటంతో ఆర్ఆర్ఆర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, హీరోల పాత్రలకు సంబంధించిన టీజర్‌లను ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అయితే ఈ సినిమా నుండి వినాయక చవితి కానుకగా ఏదో ఒక అప్‌డేట్ ఉంటుందని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్ఆర్ఆర్ నుండి ఎలాంటి అప్‌డేట్ ఉండకపోవచ్చని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో దర్శకుడు రాజమౌళి బిజీగా ఉన్నాడు.

దీంతో ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించి ఎలాంటి పండుగ అప్‌డేట్ ఉండదని తెలుస్తోంది. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో కూడా చిత్ర యూనిట్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. దీంతో అభిమానులు ఈ సినిమా నుండి ఏదైనా అప్‌డేట్ వస్తుందిన భావించి, ఇప్పుడు ఏదీ రాకపోవడంతో తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. మరి ఈ సినిమా నుండి నెక్ట్స్ అప్‌డేట్ ఎప్పుడు వస్తుందా, ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ఎప్పుడు ప్రకటిస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Share post:

Popular