లవ్ స్టోరీ సినిమాలో రెండు క్లైమాక్స్ లు.. ఇందులో నిజమెంత?

September 23, 2021 at 8:50 pm

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా లవ్ స్టోరీ సినిమా కోసమని శేఖర్ కమ్ముల రెండు క్లైమాక్స్ లు చిత్రీకరించినట్లుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం కొనసాగుతుంది. ఈ సినిమా లింగ వివక్ష కుల వివక్ష చుట్టూ తిరిగే సినిమా అన్న విషయం మనందరికీ తెలిసిందే. కులాంతర ప్రేమ పెళ్లిళ్ల విషయంలో సొసైటీలో జరిగే కొన్ని దారుణమైన ఘటనల స్ఫూర్తితో శేఖర్ కమ్ముల ఈ సినిమాను తీసినట్లుగా తెలుస్తోంది.

అయితే ఇలాంటి కథ విషయంలో తమిళ్ ఫిలిం మేకర్స్ తీరు వేరుగా ఉంటుంది. వాళ్ళు హార్ట్ బ్రేకింగ్ లా ఉండే క్లైమాక్స్ ను తీర్చిదిద్దుతుంటారు. కానీ శేఖర్ కమ్ముల శైలు ప్రకారం చూస్తే ఈ సినిమా ముగింపు అలా ఉండే అవకాశం లేదు. ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేసి పాజిటివ్ క్లైమాక్స్ తో పాటుగా ట్రాజిక్ క్లైమాక్స్ కూడా చేశారంటూ ప్రచారం సాగింది. ఈ క్లైమాక్స్ సీన్ సినిమాలు ఉంచాలని విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నారనే విషయం సస్పెన్షన్ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన నాగచైతన్య ఈ ప్రచారాలను కొట్టివేస్తూ సినిమా కోసం రెండు క్లైమాక్స్ చిత్రీకరణ అంటూ ఏమి చేయలేదని కాకపోతే ఒకసారి క్లైమాక్స్ తీసిన తర్వాత దానికి కొంచెం మెరుగులు దిద్దే ప్రయత్నం జరిగింది అంటూ నాగచైతన్య చెప్పుకొచ్చాడు.

లవ్ స్టోరీ సినిమాలో రెండు క్లైమాక్స్ లు.. ఇందులో నిజమెంత?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts