ఆ విషయంలో జాగ్రత్త పడకపోతే.. కళ్యాణ్ రామ్ కు దెబ్బే..?

September 23, 2021 at 8:31 pm

టాలీవుడ్ హీరోలలో ఒకరైన కళ్యాణ్ రామ్ ప్రస్తుతం బింబిసార సినిమాలో నటిస్తున్నాడు. అందుకు సంబంధించి ఒక ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. అది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈ సినిమాకి డైరెక్టర్ వశిష్ట్.ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాని దీపావళి పండుగకు విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

విజువల్ వండర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే కళ్యాణ్ రామ్ ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలు ఫ్లాపులుగా మిగిలాయి.అందులో కళ్యాణ్ రామ్ ఇప్పుడు సరైన బ్లాక్ బస్టర్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. కళ్యాణ్ రామ్ ప్రమోషన్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది.

కరోనా వల్ల మారిన పరిస్థితుల ప్రభావం.. సినిమా టాక్ బ్లాక్ బస్టర్ వస్తేగానీ భారీ కలెక్షన్లు వసూలు అయ్యేలా కనిపించలేదు. ఇక ఈ సినిమాకి మొదటి భాగానికి ఏకంగా 40 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇక ఇంత డబ్బులు అంటే కళ్యాణ్ రామ్ కు ఈ సినిమా కత్తి మీద సాము లాంటిదే అని చెప్పుకోవాలి. ఇక ఈ సినిమా కళ్యాణ్ రామ్ సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుంది లేదో వేచి చూడాల్సిందే.

ఆ విషయంలో జాగ్రత్త పడకపోతే.. కళ్యాణ్ రామ్ కు దెబ్బే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts