నాగ చైతన్య – సమంత.. ఫ్యాన్స్ ఖుషి అయ్యే విషయం ఏమిటంటే..?

September 23, 2021 at 9:09 pm

గత కొన్ని రోజులుగా నాగచైతన్య – సమంత ల విడాకుల గురించి వస్తున్న వార్తలకు ఎట్టకేలకు నాగచైతన్య స్వస్తి పలికాడు.. ఆయన ఇటీవల ఒక ప్రముఖ ఇంగ్లీష్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ.. తాను సోషల్ మీడియా ఎక్కువగా చూడానని, వార్తా పత్రికల ద్వారా స్నేహితుల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే తెలుసుకుంటూ ఉంటాను అని తెలిపాడు నాగచైతన్య..

ప్రొఫెషనల్ లైఫ్ కి , పర్సనల్ లైఫ్ కి సంబంధం ఉండదు అని , సెట్లో ఉన్నంతసేపు ప్రొఫెషనల్ గా వ్యవహరిస్తామని, ఇంట్లోకి వెళ్లిన తర్వాత వ్యక్తిగత జీవితం కొనసాగిస్తామని తెలిపాడు నాగచైతన్య. ముఖ్యంగా ఈ విషయాన్ని తన తండ్రి నాగార్జున నుంచి నేర్చుకున్నానని తెలిపాడు నాగచైతన్య.. ఇక వార్తాపత్రికల విషయానికి వస్తే..ఈ నిమిషం ఈ వార్త వచ్చింది అని ప్రేక్షకులు చదివే లోపే , ఈ విషయానికి సంబంధించి మరో వార్తా పత్రికలో ఇంకొక రకంగా మార్చి రాస్తూ ఉంటారు రైటర్స్.. కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే అని వారు చెబుతున్నారు.

నేను కూడా ప్రేక్షకులను ఎంటర్ టైన్ మెంట్ చేయడానికి నటిస్తున్నాను.. కాబట్టి మా మీద వచ్చే రూమర్స్ గురించి పెద్దగా పట్టించుకోను.. సామ్ కు నాకు మధ్య ఉన్న బంధం ఏమిటో తెలుసు.. ఎవరో ఏదో చెబుతున్నారని మేము విడిపోవాల్సిన అవసరం లేదు.. మేము చిరకాలం ఎప్పటికీ సంతోషంగానే జీవిస్తాము అంటూ నాగచైతన్య తెలపడంతో ఇక అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.. ముఖ్యంగా ఒక బంధాన్ని విడగొట్టే వార్తలు రాయవద్దు అంటూ ఆయన వార్త మీడియాను ఆర్ధిస్తున్నాడు.. ఎట్టకేలకు నాగచైతన్య – సమంత విడిపోలేదని తెలిసి అందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

నాగ చైతన్య – సమంత.. ఫ్యాన్స్ ఖుషి అయ్యే విషయం ఏమిటంటే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts