బాలయ్య ‘అఖండ’ మెలోడీ సాంగ్ వచ్చేసింది !

September 18, 2021 at 2:32 pm

బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం అఖండ. ఈ సినిమాలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం.ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నది.ఈ సినిమాతో బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్లు మూడవ సినిమాగా తెరకెక్కించబోతున్నారు.ఈ సినిమాకు సంబంధించి ఫుల్ లిరిక్స్ ని ఈరోజు సాయంత్రం 5 గంటల 33 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు ద్వారక క్రియేషన్స్ సంస్థ తెలియజేసింది.

ఇక ఈ సినిమాపై బాలకృష్ణ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఏది డిజాస్టర్ కాలేదు.ఇందులో ముఖ్యమైన పాత్రలో హీరో శ్రీకాంత్ నటిస్తున్నాడు. ఇక అంతే కాకుండా జగపతి బాబు కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.ఇక ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా నుండి సాయంత్రం”అడిగా అడిగా”అనే ఫుల్ లిరిక్స్ ను విడుదల చేశారు .ఈ సినిమాని ద్వారక క్రియేషన్స్ బేనర్పై నిర్మించనున్నారు.

బాలయ్య ‘అఖండ’ మెలోడీ సాంగ్ వచ్చేసింది !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts