విక్రమార్కుడు-2 సినిమా తీయడానికి కథ రెడీ.. కానీ..?

September 18, 2021 at 1:40 pm

హీరో రవితేజ ,అనుష్క హీరోయిన్ గా నటించిన చిత్రం విక్రమార్కుడు ఈ సినిమా ప్రేక్షకులను బాగా మెప్పించిన అని చెప్పవచ్చు.అంతేకాకుండా రాజమౌళికి పెద్ద విజయంని తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు. రవితేజ – రాజమౌళి వీరిద్దరూ కలిసి ప్రేక్షకులను జింతాత ఆడించారు.అంతే కాకుండా ఈ సినిమా విడుదలై ఇప్పటికీ 15 సంవత్సరాలు కావస్తోంది.

 

విక్రమ్ రాథోడ్ గా బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా వసూళ్ల వర్షం కురిపించింది. ఇంతకాలానికి ఈ సినిమా సీక్వెల్ కోసం ఒక మంచి కథను రెడీ చేశారు. రచయిత విజయేంద్రప్రసాద్ విక్రమార్కుడు సీక్వెల్ కి సరిపడా ఈ కథను రెడీ చేశారు అయితే… పెద్ద షాక్ ఇచ్చిన రాజమౌళి ఏమిటంటే ఈ సినిమాని రాజమౌళి తీయలేదట ఎందుకంటే ఆయన వేరే సినిమాలలో చాలా బిజీగా ఉన్నారు.RRR తర్వాతమహేష్ బాబుతో సినిమా ఉంది.అంటే రాజమౌళీ ఖాళీగా అవ్వటానికి రెండేళ్లు పడుతుందని చెప్పవచ్చుఅందుకని మరో దర్శకుడికి ఈ కథని ఇచ్చారట.ఈ కథ విజయేంద్రప్రసాద్ అందించనున్నట్లుగా సమాచారం.

ఈ కథను విజయేంద్రప్రసాద్ వేరొక దర్శకుడికి ఇచ్చారు అన్నట్లుగా వినిపిస్తోంది. ఈ కథను ఏ డైరెక్టర్ కు ఇచ్చారన్న విషయం ఇంకా తెలియలేదు.ఈ సినిమా స్టోరీ చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందని ఆన్నట్లుగా తెలుస్తోంది.ఇక ఈ సినిమానే పాన్ ఇండియా లెవల్లో ఉన్నట్లుగా సమాచారం. ఈ సినిమాని సినీ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు అన్నట్టుగా సమాచారం. అయితే ఈ సినిమాని ఏ దర్శకుడు చేస్తాడో వేచి చూడాల్సిందే.

విక్రమార్కుడు-2 సినిమా తీయడానికి కథ రెడీ.. కానీ..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts