ఆమెతో న‌టించాలంటేనే భ‌యం అంటున్న మ‌హేష్‌!

బాలనటుడిగా సినీ కెరీర్ స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగు చిత్రసీమలో తండ్రికి తగ్గ తనయుడిగా గొప్ప పేరు సంపాదించుకున్నారు మహేష్ బాబు. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోగా కొన‌సాగుతున్న ఈయ‌న‌.. వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్నారు.

Sitara gives first clap for dad Mahesh Babu's Sarkaru Vaari Paara, shoot  from Jan 2021 - Movies News

ఇక‌ ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయి ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌గ‌లిగే మ‌హేష్ కు.. ఒక‌రితో న‌టించాలంటే చాలా భ‌య‌మ‌ట‌. ఇంత‌కీ ఆ ఒక‌రు ఎవ‌రో కాదు.. ఆయ‌న కుమార్తె సితార‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా మ‌హేష్ బాబునే తెలిపారు. తాజాగా మహేష్‌ బాబు బిగ్‌సీ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మహేష్.. ఎన్నో విష‌యాల‌ను షేర్ చేసుకున్నారు.

Mahesh Babu's daughter, Sitara, to make her acting debut with THIS  muppet-themed web series

ఈ క్ర‌మంలోనే ఓ విలేక‌ర్‌..సితారకు సినిమాలు చేసే ఆస‌క్తి ఉందా? అని ప్ర‌శ్నించారు. దానికి మ‌హేష్ స్పందిస్తూ.. తెలుగు సినిమాలు చేసేందుకు ఆస‌క్తి చూప‌డం లేదు. ఆమెకు ఇంగ్లీష్ సినిమాలు చేయాలని ఉంది అంటూ చెప్పుకొవ‌చ్చారు. మ‌రొక‌రు సితార‌తో మీరు న‌టించే ఛాన్స్ ఉందా ? అని అవ‌డ‌గా.. అందుకు మ‌హేష్ నిజాయితీగా చెప్పాలంటే నా కుమార్తెతో నటించడానికి నాకు భ‌యం అని తెలిపారు. దాంతో మ‌హేష్ వ్యాఖ్య‌లు ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి.

Share post:

Popular